Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మరింత దిగిరానున్న వంటనూనెల ధరలు

వంటనూనెల సుంకాలపై రాయితీలు పొడిగింపు
కీలక నిర్ణయం తీసుకున్న ఆహార మంత్రిత్వ శాఖ

ర్ణయం తీసుకుంది. వంటనూనెలపై ఉన్న రాయితీ దిగుమతి సుంకాలను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ శాఖ నోటిఫికేషన్‌ పేర్కొంది. వంటనూనెల దిగుమతిపై ఉన్న కస్టమ్స్‌ డ్యూటీ రాయితీలను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు ఈ మంత్రిత్వ శాఖ చెప్పింది. కొత్త డెడ్‌లైన్‌ మార్చి 2023గా పేర్కొంది. దేశీయంగా వంటనూనెల సరఫరాను మరింత పెంచి, ధరలను నియంత్రణలో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు భారీగా తగ్గాయి. తాజాగా ఈ రాయితీల పొడిగింపుతో ఇప్పటికే తగ్గి ఉన్న ధరలకు, రాయితీలు తోడై మరింత చౌకగా దేశీయంగా వంటనూనెలు లభ్యం కానున్నాయి. ప్రస్తుత సుంకాల విధానం క్రూడ్‌ పామాయిల్‌, ఆర్‌బీడీ పామోలీన్‌, ఆర్‌బీడీ పామాయిల్‌, క్రూడ్‌ సోయాబీన్‌, రిఫైన్డ్‌ సోయాబీన్‌, క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌కి వర్తించనుంది. ఈ రాయితీ సుంకాలు ఈ ఆయిల్స్‌కి మార్చి 31, 2023 వరకు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం పామాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లకు చెందిన క్రూడ్‌పై ఇంపోర్టు డ్యూటీ జీరోగా ఉంది. 5 శాతం అగ్రిసెస్‌ను, 10 శాతం సోషల్‌ వెల్‌ఫేర్‌ సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ వంటనూనెల క్రూడ్‌పై డ్యూటీలు కేవలం 5.5 శాతంగానే ఉన్నాయి. మిగతా రిఫైన్డ్‌ వంటనూనెల దిగుమతి సుంకాలు కూడా తక్కువగానే ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా పామాయిల్‌ ధరలు రికార్డు కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. పామాయిల్‌ రేట్లు దిగిరావడంతో.. వంటనూనెల తయారీదారులు కూడా ఆ రేట్లను వినియోగదారులకు బదాయిస్తున్నారు. పామాయిల్‌తో పాటు అంతర్జాతీయంగా సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరలు కూడా కిందకి పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా మందగమన భయాలతో ఈ రేట్లు తగ్గుతున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ వంటనూనెల రేట్లు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంతో వంటనూనెల రేట్లు కొండెక్కాయి. ఆ రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంది. రాయితీలను తగ్గించింది. దేశీయంగా సరఫరాను పెంచి, ధరలను నియంత్రించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంది. తాజాగా అంతర్జాతీయంగా ఈ రేట్లు దిగొస్తూ.. వినియోగదారులకు భారీ ఊరటనిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img