Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మరో ఇద్దరికి ఒమిక్రాన్‌.. దేశంలో 25కు చేరిన కేసుల సంఖ్య

కరోనా కొత్త వేరియంట్‌ చాప కింద నీరులా విస్తరిస్తోంది. భారత్‌లో తాజాగా మరో రెండు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌ రాష్ట్రంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ కరోనా సోకింది. ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వెలుగుచూడగా, అతనితో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య, బావమరిదికి కూడా ఈ కొత్త వేరియంట్‌ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడిరచారు. తాజాగా వచ్చిన రెండు కేసులతో గుజరాత్‌లో ఒమిక్రాన్‌ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది. కాగా, ఈ ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవని, ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నదని జామ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ ఖరాడి తెలిపారు.మరోవైపు దేశంలో ఒమిక్రాన్‌ కేసుల మొత్తం సంఖ్య 25కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢల్లీిలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో సహా 57 దేశాలు ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారినపడ్డాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img