Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మరో కొత్త వైరస్‌ ‘నియో కోవ్‌’..వ్యాప్తి, మరణాల రేటు ఎక్కువే..

సోకితే ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
హెచ్చరిస్తోన్న వుహాన్‌ శాస్త్రవేత్తలు

ఓ వైపు కరోనా మహమ్మారిలో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో..మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణాఫ్రికా దేశంలో వెలుగుచూసిన ‘నియో కోవ్‌’ అనే కొత్త రకం కరోనా వైరస్‌ వల్ల అధిక మరణాలు సంభవిస్తాయని వుహాన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నియో కోవ్‌ కొత్త కరోనా వైరస్‌ సంక్రమణ రేటు కూడా అధికంగానే ఉంటుందని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన వుహాన్‌ యూనివర్శిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఫిజిక్స్‌ శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. ఈ మేరకు వూహాన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేయడం ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. నియోకోవ్‌ వైరస్‌ను మొదట దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో కనుగొన్నారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న వైరస్‌గా గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యూటేషన్‌ కారణంగా వైరస్‌
మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందని వూహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. నియో కోవ్‌ వైరస్‌ సోకిన ముగ్గురిలో ఒకరు మరణిస్తారని, ఈ కొత్త రకం వైరస్‌ కు అధిక ప్రసార రేటు ఉందని స్పుత్నిక్‌ వుహాన్‌ శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. యాంటిబాడీలు, కొవిడ్‌ 19 వ్యాక్సిన్లు కూడా దీనికి పనిచేయకపోవచ్చని చెబుతున్నారు. అంతేగాక 2012, 2015లో మధ్య ప్రాశ్చ్య దేశాల్లో విజృంభించిన మెర్స్‌`కోవ్‌ మాదిరిగా నియో కోవ్‌తో అధిక మరణాలు ఉండొచ్చని హెచ్చరించారు. ఈ కొత్త వైరస్‌ పై చైనా జరిపిన పరిశోధనల గురించి తమకు తెలుసని రష్యన్‌ స్టేట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ వైరాలజీ అండ్‌ బయోటెక్నాలజీకి చెందిన పరిశోధకులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఇది జంతువుల్లో మాత్రమే ఉన్నందున దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని పేర్కొన్నారు. చైనా శాస్త్రవేత్తలు జరిపిన ఫలితాలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img