Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మళ్లీ కుప్పకూలిన రూపాయి..

రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం ప్రారంభ సెషన్‌లోనే ఏకంగా మరో 16 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.33కు చేరింది. ఇది ఆల్‌ టైమ్‌ లో వాల్యూ కావం గమనార్హం. అమెరికన్‌ కరెన్సీ విలువ పెరుగుతుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది. ఇది దేశీయ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోవైపు క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం కూడా రూపాయి విలువ పతనం కావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యూఎస్‌ బాండ్లలో ప్రతిఫలాలు పెరగడం కూడా రూపాయి విలువ పడేందుకు కారణమైంది. దీంతో.. రూపాయి విలువ ఈ ఒక్క ఏడాదిలోనే 10 శాతానికిపైగా పతనమైంది. గురువారం సెషన్‌లో కూడా రికార్డు స్థాయిలో 55 పైసలు క్షీణించింది. తొలిసారి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82 పైన స్థిరపడిరది. మరుసటి రోజు కూడా ఇప్పుడు అదే ధోరణి కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం వాణిజ్య లోటుకు దారితీస్తుందనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యూఎస్‌లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంతకాలం ఇలాగే ఉండొచ్చని ఐఎఫ్‌ఏ గ్లోబల్‌ రీసెర్చ్‌ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. రూపాయి విలువ పతనం అవుతున్న కొద్దీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులు ఎక్కువగా డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి.. చదువు మరింత భారంగా మారుతుంది. తద్వారా మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇదే సమయంలో రూపాయి పతనం అవుతున్న కారణంగా.. దీనిలో జోక్యం చేసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల యూఎస్‌ ఫెడ్‌ బాటలోనే వడ్డీ రేట్లను పెంచింది ఆర్‌బీఐ. ఇటీవల డాలర్‌ బలపడిన కారణంగా.. ఇక్కడి విదేశీ పెట్టుబడిదారులు మన ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకున్నారు. ఇది విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడానికి దారితీసింది. విదేశీ మారక నిల్వలు తగ్గినప్పుడు కచ్చితంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. రూపాయి విలువ తగ్గడానికి ఇది కూడా ఓ కారణం. రూపాయి విలువ పతనానికి తోడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img