Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 42,625 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. రోజూవారి నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 42,625 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,17,69,132కి చేరింది. ఇందులో 4,10,353 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3,09,33,022 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడి మొత్తం 4,25,757 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.31శాతంగా ఉందని తెలిపింది. ఇక ఇప్పటివరకు 48,52,86,570 మందికి వ్యాక్సినేషన్‌ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img