Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశవ్యాప్తంగా ఇవాళ పెట్రోలు, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.దేశ రాజధాని నగరమైన ఢల్లీిలో పెట్రోలు ధర లీటరుకు 25 పైసలు పెరిగింది. ఢల్లీిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.101.64 నుంచి రూ.101.89 కు పెరిగింది. డీజిల్‌ ధర లీటరుపై 30 పైసలు పెరిగింది. లీటరు డీజిల్‌ ధర రూ.89.87 ఉండగా అది రూ.90.17కు పెరిగింది. తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్‌ ధర 24 పైసలు పెరిగి రూ.107.95కు, లీటర్‌ డీజిల్‌ ధర 32 పైసలు పెరిగి రూ.97.84కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.106కు చేరగా, డీజిల్‌ ధర 33 పైసలు పెరిగి రూ.99.08కు పెరిగింది.దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్నాయి. జైపూర్‌లో పెట్రోల్‌ ధర రూ.108.47, డీజిల్‌ రూ.99.08గా ఉన్నది. ఇక ప్రధాన నగరాలైన కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.17, డీజిల్‌ రూ.92.97, చెన్నైలో పెట్రోల్‌ రూ.99.36, డీజిల్‌ రూ.94.45, బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.44, డీజిల్‌ రూ.95.70కు చేరాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img