Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మళ్లీ పెరిగిన రోజూవారీ కరోనా కేసులు.. 24 గంటల్లో 29 మంది మృతి

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 7 వేల కేసులు నమోదు కాగా.. నేడు 9 వేలకుపైనే కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే 44 శాతం ఎక్కువ. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,629 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం దేశంలో 61,013 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. ఇక 24 గంటల వ్యవధిలో 11,967 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కి చేరింది. కేరళలో 10 మంది, ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు చొప్పున, ఒడిశా, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,398 కి ఎగబాకింది.ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,50,086) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img