Friday, April 19, 2024
Friday, April 19, 2024

మళ్లీ 8 వేలు దాటిన కరోనా కేసులు..267 మరణాలు

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తూనే ఉన్నాయి. 2020 మార్చి తర్వాత తొలిసారిగా మంగళవారం (నవంబర్‌ 30) అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే మరోసారి 8 వేలకు పైగా నమోదయ్యాయి. మంగళవారం 11,08,467 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..8,954 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. ఇందులో 3,40,28,506 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,69,247 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా, 267 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో కేరళలోనే 4723 కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,24,10,86,850 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ఆందోళన కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. మరో పక్క నిన్న 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 124 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img