Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మహారాష్ట్రలో ఫడ్నవిస్‌ రక్షణలో నకిలీ కరెన్సీ రాకెట్‌ : నవాబ్‌ మాలిక్‌

మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు నవాబ్‌ మాలిక్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌ల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం ఫడ్నవీస్‌ గురించి మాలిక్‌ ఆరోపణలు చేశారు. ఫడ్నవీస్‌ హయాంలో జరిగిన నియామకాలను మంత్రి ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఫడ్నవీస్‌ రక్షణలో నకిలీ కరెన్సీ రాకెట్‌ కొనసాగుతోందని ఆరోపించారు. ‘‘ఫడ్నవీస్‌ ఆశీర్వాదంతో మహారాష్ట్రలో నకిలీ నోట్ల ఆట మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు ప్రకటన తర్వాత పలు రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ దొరుకుతున్నప్పుడు, మహారాష్ట్రలో దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 2017అక్టోబర్‌ 8 న డీఆర్‌ఐ దాడులు చేసి రూ.14.56 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి సీఎం ఫడ్నవీస్‌ కేవలం రూ.8.80 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపడంతో కేసు బలహీనపడిరది’’ అని పేర్కొన్నారు. ముంబైలో అరెస్టయిన నిందితుడు ఇమ్రాన్‌ ఆలం షేక్‌ బెయిల్‌ పొందాడని, ఇతనిపై ఎలాంటి విచారణ జరగలేదని చెప్పారు. 1993 బాంబ్‌ బ్లాస్ట్‌ కేసులో నవాబ్‌ మాలిక్‌కు ప్రమేయం ఉందంటూ ఫడ్నవీస్‌ ఆరోపిస్తుండగా.. తాను ఒక్క హైడ్రోజన్‌ బాంబ్‌ వేసి దేవేంద్ర ఫడ్నవీస్‌ కుంభకోణాలన్నీ బయటపెట్టానని మాలిక్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img