Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్టు

మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన ఓ మనీ లాండరింగ్‌ కేసులో నవాబ్‌ మాలిక్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం నవాబ్‌ మాలిక్‌ను ఈడీ అధికారులు మాలిక్‌ నివాసానికి వెళ్లారు. మనీ లాండరింగ్‌ కేసులో ఆయన్ని కొన్ని గంటలపాటు విచారించారు. మాలిక్‌ వెంట ఆయన కుమారుడితో పాటు లాయర్‌ అమీర్‌ మాలిక్‌ ఉన్నారు.అనంతరం ఈడీ అధికారులు ఆయన్ని కార్యాలయానికి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img