Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘మహా’ సర్కారు త్వరలోనే కూలిపోతుంది: మమతా బెనర్జీ

మహారాష్ట్ర ఫ్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఏర్పడిన కొత్త అధికార కూటమి ఆరు నెలల్లో కూలిపోతుందని ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యల తరహాలోనే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ ఈస్ట్‌-2022’ కార్యక్రమంలో పాల్గొన్న మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొనసాగుతుందని తాను భావించడం లేదన్నారు. అది అనైతిక, అప్రజాస్వామిక సర్కారని విమర్శించారు. వారు ప్రభుత్వాన్నయితే ఏర్పాటు చేశారు కానీ, ప్రజల హృదయాలను మాత్రం గెలవలేరన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చని, కానీ అదే ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజలు మిమ్మల్ని కిందికి దింపుతారని హెచ్చరించారు. వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపైనా మమత స్పందించారు. తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ రాజకీయాల్లో ఉండడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలు అతడిని రెండుసార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. దేశ బాధ్యతలను యువత చేపట్టాలని మీకు లేదా? అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతున్న బీజేపీ అమిత్‌ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి ఎలా దక్కిందన్నారు. దీని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని ‘దీదీ’ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img