Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మార్చి16లోగా నివేదికివ్వండి

రిషికొండ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రిషికొండ అక్రమ తవ్వకాల వ్యవహారానికి సంబంధించి మార్చి 16వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసును హైకోర్టులో గురువారం విచారించింది. గతంలో రుషికొండ అక్రమ తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిపి కమిటీ వేయాలని కోర్టు ఆదేశించగా, ఏపీ ప్రభుత్వం ఎక్కువమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులుండేలా కమిటీ ఏర్పాటు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్‌ మూర్తీయాదవ్‌ రాష్ట్ర సభ్యులతో కూడిన కమిటీ వాస్తవాలను కప్పిపుచ్చే అవకాశం ఉందంటూ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కేంద్ర కమిటీ సభ్యులతో మాత్రమే కమిటీ వేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. తాజా విచారణ క్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే రిషికొండను సందర్శించి మార్చి 16వ తేదీలోగా వాస్తవ పరిస్థితిని కోర్టుకు నివేదించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు నెలలు గడువిస్తే కేంద్ర కమిటీ బృందంతో సందర్శించి వివరాలు కోర్టుకు సమర్పిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం కోరారు. దానిపై అనుకూలంగా స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాలుగు వారాల సమయమిచ్చారు. మార్చి 16లోగా నివేదిక ఇవ్వాలంటూ తదుపరి విచారణ అదేరోజుకి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img