Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ సాక్షి కిరణ్‌ గోసవి అరెస్ట్‌

ముంబై క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో ఎన్సీబీ సాక్షిగా ఉన్న కిరణ్‌ గోసవిని పుణె పోలీసులు అరెస్టు చేశారు. ఓ చీటింగ్‌ కేసుకు సంబంధించి కిరణ్‌ గోసావిని ప్రశ్నిస్తున్నట్లు పూణే పోలీసులు చెప్పారు. అయితే సోమవారం లక్నోలో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు కిరణ్‌ గోసవి అనుమతి కోరినప్పటికీ.. ఆ ప్రతిపాదనను పోలీసులు అంగీకరించలేదు. మొత్తానికి కిరణ్‌ గోసవిని గురువారం అదుపులోకి తీసుకున్నట్లు పుణె పోలీసు కమిషనర్‌ అమితాబ్‌ గుప్తా తెలిపారు.2018లో చీటింగ్‌ కేసులో కిరణ్‌ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. 2019లో కిరణ్‌ గోసవిని పుణె పోలీసులు మోస్ట్‌ వాంటెడ్‌గా ప్రకటించారు. ఈ నెల ప్రారంభంలో ఆర్యన్‌ ఖాన్‌ తోపాటు పలువురిని అరెస్టు చేయడానికి దారితీసిన క్రూయిజ్‌ షిప్‌పై ఎన్సీబీ దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత గోసావి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తో సెల్ఫీలో కనిపించాడు.ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న గోసవిపై అక్టోబర్‌ 14న పుణె పోలీసులు లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారు. మొత్తానికి కిరణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్‌ గోసావి కేపీజీ డ్రీమ్స్‌ సొల్యూషన్స్‌ పేరుతో ఔత్సాహికులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కంపెనీ నడిపాడు.మలేషియాలోని ఓ హోటల్‌ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసావి ఒకరి నుంచి రూ.3.09లక్సలు తీసుకొని మోసం చేశాడని పూణే పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img