Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మున్సిపాలిటీ వద్దే వద్దు

ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించిన ప్రజలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి రాజధాని ప్రాంత గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో కూడా రాజధాని గ్రామాలతో పాటు, ఇతర ప్రాంతాలను నగర పాలక సంస్థను ఏర్పాటు చేయాలని నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రభుత్వం అభాసుపాలైంది. అయినప్పటికీ ప్రస్తుతం రాజధాని రైతులు పాదయాత్ర 2.0 ప్రారంభించిన నేపధ్యంలో మరలా కొత్తగా మున్సిపాలిటీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై ఆఘమేఘాలపై రాజధాని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. దీనిలో భాగంగా ఒక పక్క రైతులు పాదయాత్ర ప్రారంభంలో మునిగి ఉండగా, ప్రభుత్వం మరోపక్క గ్రామ సభలు నిర్వహించింది. తొలిరోజు లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం గ్రామాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించగా, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. లింగాయపాలెం గ్రామ సభకు మొత్తం 79 మంది హాజరు కాగా, వారిలో 78 మంది అమరావతి మున్సిపాలిటీని వ్యతిరేకించారు. ఒకే ఒక వ్యక్తి మాత్రమే అధికారుల ప్రతిపాదనను స్వాగతించారు. ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం గ్రామంలో కూడా ప్రజలు మూకుమ్మడిగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించారు. రాజధాని గ్రామాలతో పాటు, నాన్‌ ఫూలింగ్‌ గ్రామాలైన హరిశ్చంద్రపురం, వడ్డమాను, పెద పరిమి గ్రామాలను కలిపి మొత్తం 32 గ్రామాలతో కూడిన అమరావతి మెట్రోపాలిటిన్‌ సిటీ ఏర్పాటు చేయాలని హరిశ్చంద్రపురం గ్రామస్తులు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img