Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మూడో రోజు ఈడీ విచారణకు రాహుల్‌గాంధీ

నేషనల్‌ హెరాల్డ్‌ మనీ-లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడో రోజైన బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణపై కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం దగ్గర భద్రతా బలగాలను మోహరించి 144 సెక్షన్‌ విధించారు. రాహుల్‌ గాంధీకి మద్దతు తెలుపుతూ రాబర్ట్‌ వాద్రా ఫేస్‌బుక్‌ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఈడీ చర్య పాలకవ్యవస్థకు నష్టం కలిగిస్తుందని కాంగ్రెస్‌ నేతలు అశోక్‌ గెహ్లాట్‌, భూపేష్‌ బాఘేల్‌, మల్లికార్జున్‌ ఖర్గే, రణదీప్‌ సూర్జేవాలా వంటి కాంగ్రెస్‌ అగ్రనేతలు పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటలపాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. అయితే రాహుల్‌ పదే పదే వాంగ్మూలాన్ని మార్చుకోవడంతో విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాహుల్‌ తల్లి సోనియా గాంధీని చూసేందుకు నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట సోదరి ప్రియాంకగాంధీ వాద్రా కూడా ఉన్నారు. కొవిడ్‌ సంబంధిత సమస్యలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఇటీవల సర్‌ గంగారామ్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img