Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మోదీ క్షమాపణ చెప్పాలి

కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలి
అశిష్‌మిశ్రాను హత్యా నేరం కింద అరెస్ట్‌ చేయాలి
‘లఖింపూర్‌’ దారుణాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన రైతుల మారణకాండపై మంగళవారం సీపీఐ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని నరేంద్ర మోదీ దేశానికి అన్నంపెట్టే అన్నదాతలను సైతం చంపించే కార్యక్రమానికి ఒడిగట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ విజయవాడ నగర సమితి అధ్వర్యాన మంగళవారం లెనిన్‌ సెంటర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న అజయ్‌కుమార్‌ మిశ్రా కుమారుడు రైతులపై కార్లతో దూసుకువెళ్లి నలుగురు అన్నదాతలను పొట్టన పెట్టుకోవడం వారి అధికార అహంకారానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ దారుణంపై ప్రధానమంత్రి నోరుమెదపక పోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో రామరాజ్యం సాగుతోందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి పట్టపగలే రైతులను చంపేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రాను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని, ఈ ఘాతుకానికి కారణమైన ఆయన కుమారుడు ఆశీష్‌ మిశ్రాపై హత్యా నేరం, టాడా చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రజల్లి విల్సన్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ మోదీ ఎంత మొండిగా ఉన్నా దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందులు పెట్టడం మంచి కాదని, అన్నదాతలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశానికి ఆహార భద్రత కల్పించే రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కార్లతో దూసుకువెళ్లి చంపడం దుర్మార్గమని అన్నారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని, ఇందుకోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారు, పట్టణ ప్రాంత కార్మికులు, ప్రజలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అన్నదాతలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా ...రావుల వెంకయ్య ఆలిండియా కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ తనకు 5 నిమిషాలు సమయం ఇస్తే రైతు ఉద్యమాన్ని అణచివేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటించడాన్ని చూస్తే వారి నియంతృత్వ ధోరణి స్పష్టంగా అర్థమవుతోందన్నారు. హరియాణా ముఖ్యమంత్రి స్వయంగా రైతుల తలలు పగలగొట్టాలని పిలుపునివ్వడం సిగ్గుచేటని, దేశానికి అన్నం పెట్టే రైతులకు బీజేపీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై వారికి నమ్మకం లేదని, తమ ఇష్టాను సారంగా బీజేపీ నేతలు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వెంకటసుబ్బయ్య, ప్రజానాట్యమండలి నాయకులు ఆర్‌.పిచ్చయ్య, ఎస్‌కే నజీర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి దారుణ ఘటన దేశంలో ఇదే మొదటిసారిముప్పాళ్ల
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను సాక్షాత్తు కేంద్ర మంత్రి కుమారుడు కారుతో తొక్కించి హత్య చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతులను వాహనాలతో తొక్కించి చంపిన పాశవిక ఘటనను నిరసిస్తూ సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు మల్లయ్యలింగంభవన్‌ నుంచి లాలాపేట హిమని సెంటర్‌లో ఉన్న గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇంత జరిగినా కేంద్రంలోని నరేంద్ర మోదీ గాని, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ó్‌ గాని ఘటనపై నోరుమెదపకపోవడం దుర్మార్గమన్నారు. ఈ
రైతు హత్యలకు కేంద్రానిదే బాధ్యత`ఓబులేశు
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైతుల హత్యలకు కేంద్రం బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు. రైతు ఉద్యమం వెనకాల వామపక్ష తీవ్రవాదులు ఉన్నారని చెప్పడం సమంజసం కాదన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్న ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఉగ్రవాదమా అని ప్రశ్నించారు. రైతాంగ ఆందోళనను అణగదొక్కటానికి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కావాలనే ప్రభుత్వం ఉద్ధేశపూర్వకంగా హత్యలు చేస్త్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ó్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ , నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు గని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శులు, ప్రజాసంఘాల బాధ్యులు, పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల్లో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img