Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోదీ ఫాసిస్టు విధానాలు బట్టబయలు

బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులకు సీపీఐ ఖండన

న్యూదిల్లీ: ప్రముఖ మీడియా దిగ్గజం బీబీసీకి చెందిన దిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ దాడులతో మోదీ ప్రభుత్వ ఫాసిస్టు విధానాలు బట్టబయలయ్యాయని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విమర్శించింది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విమర్శించే ప్రతి ఒక్కరిపై దాడులకు తెగబడటంతో మోదీ ప్రభుత్వ మతోన్మాద`ఫాసిస్టు విధానాలు బట్టబయలయ్యాయని విమర్శించింది. ‘ది మోదీ క్వశ్చన్‌’ డాక్యుమెంటరీని బీబీసీ ఇటీవల విడుదల చేసిన క్రమంలోనే మోదీ ప్రభుత్వం కక్షసాధింపునకు దిగిందని పార్టీ జాతీయ కార్యదర్శివర్గం పేర్కొంది. ఈ డాక్యుమెంటరీ ఎక్కడా ప్రసారం కాకుండా ఆంక్షలు విధించిందని, యూనివర్సిటీల్లోనూ ప్రసారం చేయకుండా నిషేధాజ్ఞలు జారీ చేసిందని గుర్తుచేసింది. విదేశీ మీడియా సంస్థను బెదిరించేందుకు ఇప్పుడు ప్రభుత్వ సంస్థను మోదీ సర్కార్‌ వాడుకుంటోందని విమర్శించింది. తద్వారా దేశ ప్రతిష్ఠ మంటగలుస్తోందని, ఇప్పటికే మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img