Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వెయ్యి దిగువకు కరోనా కొత్తకేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్న 63,786 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 862 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,44,938కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,503 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 22,549 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,980 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.56 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img