Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మోదీ విధానాలపై రైతుల ఐక్యపోరాటాలు

త్రిసూర్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వినాశకర రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులు ఐక్యంగా ఉద్యమించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై ఏఐకేఎస్‌ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు జె.వేణుగోపాలన్‌ నాయర్‌ నేతృత్వంలో ఉత్తర ప్రాంత పాదయాత్ర, ప్రధాన కార్యదర్శి వి.చామున్ని సారథ్యంలో దక్షిణ ప్రాంత పాదయాత్ర జరిగాయి. దాదాపు 200 గ్రామాలలో పర్యటిస్తూ సాగిన ఈ రెండు జాతాలు త్రిస్సూర్‌లో కలిశాయి. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు హాజరైన ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావుల వెంకయ్య మాట్లాడుతూ, ఈ రైతు సహాయ యాత్రలు దేశానికే ఆదర్శమని, రైతు రక్షక యాత్రల ద్వారా రైతుల సమస్యలను అధ్యయనం చేసి చర్చించవచ్చున న్నారు. భారతదేశమంతటా ఇలాంటి పర్యటనల ద్వారా రైతులకు సహాయం చేయవచ్చని కూడా ఆయన అన్నారు. నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఢల్లీిలో రైతులు ఏడాది పాటు సమ్మె చేశారని, స్వాతంత్య్రానికి ముందు లేదా తర్వాత ఇలాంటి పోరాటం లేదని గుర్తుచేశారు. కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా వేలాది మంది రైతులు, కూలీలు ఏకమై సమ్మెలో పాల్గొన్నారన్నారు. నిరంతర పోరాటాల ఫలితంగా కేంద్రం తలవంచింది కానీ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, దేశ ప్రజలను, రైతులను దెబ్బతీసే విధానాన్ని మోదీ అనుసరిస్తున్నారన్నారు. ఏటా వ్యవసాయ రంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోత పెడుతున్నారు. ప్రతి సంవత్సరం 500 కోట్లు కట్‌ చేసి వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నది చాలా తక్కువ మొత్తమని, కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర తగ్గించిందన్నారు. బడ్జెట్‌ ప్రకటనలు వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయని, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మార్చి 20న అన్ని రాష్ట్రాల రైతులు దిల్లీకి మళ్లీ తరలివస్తున్నారని చెప్పారు. వాతావరణం, నీరు, వన్యప్రాణుల దాడుల వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న రైతులను ఆదుకునేందుకు, అలాగే, పథకాల అమలు, కొత్త చట్టాల కోసం ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని రావుల వెంకయ్య డిమాండ్‌ చేశారు. అలాగే, ఈ నెల 23వ తేదీన జరిగే చలో రాజ్‌భవన్‌ను విజయవంతం చేయాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.
ఆర్గనైజింగ్‌ కమిటీ కన్వీనర్‌, మాజీ మంత్రి వీఎస్‌ సునీల్‌కుమార్‌ బహిరంగ సభకు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే పి బాలచంద్రన్‌ స్వాగతం పలికారు. కిసాన్‌సభ జిల్లా అధ్యక్షులు కెకె రాజేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలన్‌, చామున్నిలతోపాటు జాతా వైస్‌ కెప్టెన్‌ ఏపీి జయన్‌, డైరెక్టర్‌ మాథ్యూ వర్గీస్‌, జాతా సభ్యులు జాయ్‌కుట్టి జోస్‌, ఈఎన్‌ దాసప్పన్‌, ఆర్‌ చంద్రిక, ఉత్తర ప్రాంత జాతా కెప్టెన్‌ జె వేణుగోపాలన్‌ నాయర్‌, వైస్‌ కెప్టెన్‌ ఎ ప్రదీపన్‌, డైరెక్టర్‌ కెవి వసంతకుమార్‌, జాతా సభ్యులు టికె రాజన్‌ మాస్టర్‌, బంగళం కున్హికృష్ణన్‌ పాల్గొనగా, దీపా ఎస్‌ నాయర్‌ స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి సత్యన్‌ మొకేరి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెేపీి రాజేంద్రన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి కేకే వత్సరాజ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీఎన్‌ జయదేవన్‌, కార్యదర్శి టిఆర్‌ రమేష్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి టికె సుధీష్‌, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేపీి సందీప్‌, షీలా విజయకుమార్‌, రాకేష్‌ కణియంపరంపిల్‌, కేరళ మహిళాసంఘం జిల్లా అధ్యక్షురాలు షీనా పరయంగటిల్‌, జిల్లా కార్యదర్శి ఎం స్వర్ణలత, యువ కళాసాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇఎం సతీశన్‌, కెఎస్‌ జయ, టి ప్రదీప్‌ కుమార్‌, కెబి సుమేష్‌, ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌ పరేరి, జిల్లా అధ్యక్షులు బినోయ్‌ షెబీర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కెఎ అఖిలేష్‌, జిల్లా అధ్యక్షులు అర్జున్‌ మురళీధరన్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img