Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మోర్బీలో వంతెన కూలిన ఘటన..141కు చేరిన మృతుల సంఖ్య

ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది
177 మందిని రక్షించిన సహాయక బృందాలు
గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను రద్దు చేసుకున్న ప్రధాని

గుజరాత్‌లోని తీగల వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. తాజాగా ఆ సంఖ్య 141కు చేరింది. సహాయ చర్యల కోసం ఇక్కడికి చేరుకున్న నావికాదళం, వాయుసేన, సైన్యం, ఎడీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటివరకు. 177 మందిని రక్షించినట్లు గుజరాత్‌ సమాచార శాఖ వెల్లడిరచింది. ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రి మొత్తం నదిలో గాలింపు చర్యలను కొనసాగించాయి. తెల్లవారుజామున సైన్యం కూడా ఈ బృందాలకు సాయంగా వచ్చింది. మృతదేహాల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నట్లు సైన్యానికి చెందిన మేజర్‌ గౌరవ్‌ వెల్లడిరచారు. మోర్బీ జిల్లాలోని మచ్చు నదిపై 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తీగల వంతెన నిన్న సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే అక్కడ దృశ్యాలు భీతావహంగా మారిపోయాయి. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 500 మంది వరకు ఉన్నారు. ప్రమాదం జరిగాక కొందరు నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు రక్షించుకోగా, మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారి కోసం బోట్ల సాయంతో గాలిస్తున్నారు. సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరమ్మతుల కోసం ఏడు నెలలపాటు మూసివేసిన ఈ బ్రిడ్జిని ఈ నెల 26న తిరిగి తెరిచారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్‌ ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి బ్రిజేష్‌ మెర్జా ప్రకటించారు. ప్రమాదం నేపథ్యంలో గుజరాత్‌లో నేటి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని హోం మంత్రి హర్ష్‌ సంఘ్వి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img