Friday, April 19, 2024
Friday, April 19, 2024

యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రధాని ఆదేశం

అన్ని విభాగాల్లోని ఖాళీలపై ఉన్నతస్థాయి సమీక్ష
మిషన్‌ మోడ్‌లో ఏడాదిన్నర కాలంలో భర్తీ చేయాలంటూ ఆదేశాలు
ప్రకటన విడుదల చేసిన ప్రధాని కార్యాలయం

యుద్ధ ప్రాతిపదికన రాబోయే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ వివిధ విభాగాలు, పలు మంత్రిత్వ శాఖలను కోరినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం వెల్లడిరచింది. అన్ని ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లోని మానవ వనరులు, ఉద్యోగుల పరిస్థితిపై సమీక్ష అనంతరం మోదీ ఈ ఆదేశాలు వెలువరించినట్టు పీఎంఓ పేర్కొంది. ప్రతిపక్షాలు తరచూ నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ప్రధాని నుంచి ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీల అంశాన్ని వివిధ పార్టీలు తరచూ ప్రస్తావిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి మోదీ సర్కారు సన్నద్దమైనట్టు తెలుస్తోంది. ‘‘అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖాల్లోని మానవవనరులు స్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు.. అనంతరం యుద్ధ ప్రాతిపదికన రాబోయే ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img