Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యువత వారి సమస్యలపై ఎన్నికలకు వెళ్లాలి

యూపీ సీఎం ‘80 వర్సెస్‌ 20 పిసి’ వ్యాఖ్యను ఖండిరచిన ప్రియాంక
న్యూదిల్లీ : కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు చేశారు. యూపీలో ‘80 శాతం వర్సెస్‌ 20 శాతం’ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయంటూ ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక ఘాటుగా స్పందించారు. విద్య, ఉపాధి వంటి సమస్యల గురించి ఎన్నికలకు వెళ్లాలని యువతను కోరారు. 80-20 వంటి వ్యాఖ్యలు యువత వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఉద్దేశించినవని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అన్నారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో ఇది 80 శాతం వర్సెస్‌ 20 శాతం ఎన్నికలు అని, రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో హిందువులు, ముస్లింల నిష్పత్తిని సూచించే లక్ష్యంతో ‘80 వర్సెస్‌ 20’ సూచన ద్వారా విభజన ప్రయత్నమని అనేక మంది ప్రతిపక్ష నాయకులు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలపై విమర్శల దాడి చేశారు. ‘80-20’ లాంటి వ్యాఖ్యలు చేయడం యువత సమస్యల నుంచి మోసపూరితంగా దృష్టి మళ్లించే మార్గమని ప్రియాంక గాంధీ అన్నారు. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రతి 100 మందిలో 68 మందికి పని లేదని ఆమె తెలిపారు. ‘నా యువ మిత్రులారా, మీ శక్తితో యూపీ ఎన్నికలను, ఉపాధి, విద్య వంటి అంశాల ఎన్నికలుగా మార్చండి’ అని ప్రియాంక గాంధీ హిందీలో ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img