Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించిన పాక్‌.. మండిపడ్డ భారత్‌

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్‌ అంశంపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్‌ అక్రమ్‌ ప్రస్తావించగా.. భారత్‌ విరుచుకుపడిరది. కశ్మీర్‌లోని పరిస్థితులను రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో పోల్చగా.. ఐక్యరాజ్య సమిథిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో రష్యా యద్ధం వంటి తీవ్రమైన అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, అయితే, ఈ ఫోరమ్‌ను ఓ ప్రతినిధి బృందం దుర్వినియోగం చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. నా దేశంపై పలికిమాలిన, అర్థం వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆమె మాట్లాడుతూ పదేపదే అబద్ధాలు చెప్పే మనస్తత్వం ఉన్న దేశాలు ఎప్పుడూ సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తాయని.. కానీ, దానివల్ల ప్రయోజనం లేదని రుచిరా కాంబోజ్‌ అన్నారు. పాక్‌ ప్రతినిధి విశ్వసించినా.. లేకపోయినా జమ్మూకశ్మీర్‌ మొత్తం ఎల్లప్పడూ భారత్‌లో అంతర్భాగమేనని.. విడదీయరాని బంధం ఉంటుందన్నారు. పౌరులు తమ జీవించే హక్కును, స్వేచ్ఛను ఆస్వాదించగలిగేలా ఉగ్రవాదాన్ని ఆపాలని తాము పాక్‌ను కోరుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img