Friday, April 19, 2024
Friday, April 19, 2024

యూనిటీ`22 అంతరిక్ష యాత్ర విజయవంతం

నిర్ణీత సమయానికి
గంటన్నర ఆలస్యంగా ప్రారంభం

హ్యూస్టన్‌ : వినువీధిలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. ఆరుగురు సభ్యుల బ్రాన్సన్‌ బృందం రోదసీ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని దాదాపు 90 నిమిషాలకు తిరిగివచ్చారు. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి బండ్ల శిరీష తొలిసారి ప్రవేశించారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ను వీఎంఎస్‌ ఈవ్‌ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి రాకెట్‌ ప్రజ్వలనంతో యూనిటీ-22 మరింత ఎత్తుకు వెళ్లింది. చివరి దశలో సొంత ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ వ్యోమనౌకలో వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌తో పాటు మరో అయిదుగురు ప్రయాణించగా.. వారిలో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. నాలుగో వ్యోమగామిగా ఉన్న శిరీష వ్యోమ నౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం రూపొందించిన ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ యాత్ర విజయవంతం కావడంతో భారత్‌ నుంచి అంతరిక్షానికి వెళ్లిన నాలుగో వ్యోమగామిగా శిరీష చరిత్ర పుటలకు ఎక్కారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్‌ సునీతా విలియమ్స్‌ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతోపాటు అమెరికాలోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వర్జిన్‌ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షు రాలిగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఈ స్పేస్‌ వాక్‌ చేశారు. ఈ యాత్రలో అందరూ సురక్షితంగా ఉండేలా చూడా ల్సిన బాధ్యత వర్జిన్‌ గెలాక్టిక్‌ ముఖ్య వ్యోమగామి శిక్షకురాలు బెత్‌ మోసెస్‌ది కాగా వ్యోమనౌకలోని క్యాబిన్‌ పనితీరును పరిశీలించి, భవిష్యత్‌ ఆధునికీకర ణలను గుర్తించే బాధ్యత ముఖ్య ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెనెట్‌ది. ముఖ్య పైలట్‌గా డేవ్‌ మెక్‌కే, సహ పైలట్‌గా మైఖేల్‌ మాసుకీ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు జెఫ్‌ బెజోస్‌ కంటే ముందే ఈ బృందం అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ యాత్ర సురక్షితంగా సాగాలని బెజోస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శుభాభినందనలు తెలిపారు.
శిరీకుకు ఏపీ గవర్నర్‌ అభినందన
అమెరికాలోని న్యూ మెక్సికో నుంచి అంతరిక్షంలోకి చారిత్రాత్మక ప్రయాణం చేయడానికి సిద్దమైన గుంటూరుకు చెందిన శిరీష బండ్లను ఏపీ గవర్నర్‌ బిష్వ భూషణ్‌ హరిచందన్‌ అభినందించారు. తొలి తెలుగు మహిళగా, భారతీయ సంతతికి చెందిన మూడవ మహిళగా ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుతున్నట్టు ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img