Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యూపీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదు : ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని, శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. లక్నోలోని బాపూ భవన్‌లో ప్రభుత్వ అధికారి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని వేధించిన ఘటనలో అరెస్ట్‌ అయిన నేపథ్యంలో ప్రియాంక గాంధీ గురువారం ఈ విధంగా అన్నారు. యూపీలో ఎక్కడా కూడా మహిళలకు భద్రత లేదని, సచివాలయం, రోడ్డు లేదా మరే ప్రదేశంలోనైనా అభద్రతలోనే ఉన్నారని అన్నారు.మహిళల భద్రతపై యోగి సర్కార్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవ పరిస్థితి ఇలా ఉందని అన్నారు. యూపీలో ఓ సోదరి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపట్టలేదన్నారు. దేశ మహిళలంతా మీ వెంట ఉన్నారని బాధితురాలికి ఆమె భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img