Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యూరియా…ఇదేం తీరయా…!

. రబీలో వేధిస్తున్న కొరత
. అధిక ధరలకు విక్రయాలు
. తనిఖీలున్నా… ప్రయోజనం సున్నా

విశాలాంధ్ర బ్యూరో`ఏలూరు: రబీలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొద్ది రోజులుగా అందుతున్న ఫిర్యాదులపై విజిలెన్స్‌, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో దాడులు నిర్వహిస్తున్నా పరిస్థితి చక్కబడటం లేదు. అధికారులు వస్తున్న సమాచారం ముందుగానే పసిగడుతున్న వ్యాపారులు వారు వచ్చిన సమయంలో దుకాణాలు మూసివేసి తర్వాత యథావిథిగా అమ్మకాలు చేస్తున్నారు. దుకాణాల్లో ఉండాల్సిన నిల్వలను రహస్యంగా గోదాముల్లో దాస్తున్నారు. దుకాణంలో డబ్బు తీసుకొని గుమస్తాకు ఇచ్చి గోదాము వద్దకు సరుకు పంపిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియా కొరత కర్షకులను వెంటాడుతోంది. యూరియా అవసరం ఉండటంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అందుకు అనుగుణంగా నిల్వలు లేకపోవడంతో తీవ్ర కొరత ఏర్పడిరది. పది రోజుల తర్వాత అవసరమయ్యే యూరియాను రైతులు ముందుగానే కొని, నిల్వ చేయడంతో సమస్య అధికమైంది. రెండు జిల్లాల పరిధిలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ చెబుతున్నా రైతులు మాత్రం కొనుగోళ్లను తగ్గించలేదు. దీనికి తోడు ఆర్బీకేలకు వచ్చిన లారీ వచ్చినట్లే విక్రయిస్తుండడంతో ఎప్పటికప్పుడు నిల్వలు నిండుకుంటున్నాయి.
బస్తా రూ.340 పైగా వసూలు
రైతు భరోసా కేంద్రాలు, డీసీఎంఎస్‌లు, సొసైటీల్లో 45 కిలోల బస్తా యూరియా రూ.266.50కే లభిస్తోంది. ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.320 నుంచి రూ.340 వరకు చెల్లించి రైతులు కొంటున్నారు. యూరియాకు డిమాండ్‌ ఉండడంతో ఆయా కంపెనీలు కాంప్లెక్స్‌, లింకు ఎరువులు అంటగట్టడంతో పాటు రవాణా చార్జీలు సైతం వ్యాపారులపైనే వేస్తున్నాయి. కొన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువులు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా సరఫరా చేస్తామని కొన్ని కంపెనీలు షరతులు విధిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఆయా జిల్లాలకు వచ్చే యూరియాలలో 50 శాతం మార్క్‌ ఫెడ్‌, 50 శాతం ప్రైవేట్‌ వ్యాపారులకు సరఫరా అవుతుంది. మార్కెట్లో యూరియాకు డిమాండ్‌ ఏర్పడటంతో మార్క్‌ ఫెడ్‌ గోదాములకు వెళ్లకుండానే పాయింట్‌ నుంచి నేరుగా ఆయా రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4.50లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 1 లక్ష ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మార్క్‌ ఫెడ్‌ వద్ద ఉన్న నిల్వలు కరిగిపోయాయి. రైతు భరోసా కేంద్రాలు, డీసీఎంఎస్‌ సొసైటీలలో నిల్వలు కరిగిపోవడంతో ప్రైవేటు వ్యాపారులు ఆచి తూచి విక్రయిస్తున్నారు. ఫిబ్రవరి నెల వరకు వరుసగా యూరియా సరఫరా చేస్తేనే కొంత ఉపశమనం కలుగుతుందని అధికారులు తెలిపారు.
ముందస్తు నిల్వలతో కొరత
వరికి యూరియాను ఎకరాకు మూడు బస్తాలు వాడాలి. అయితే కాంప్లెక్స్‌ ఎరువులు ధరలు అధికంగా ఉండడంతో వాటిని కొనుగోలు చేయలేక రైతు భరోసా కేంద్రాల్లో రూ.266.50 లకే బస్తా వస్తుండడంతో ప్రత్యామ్నాయంగా యూరియా వైపు మొగ్గుతున్నారు. సగటున ఎకరాకు 8 నుంచి 10 బస్తాల వరకు చల్లుతున్నారు. కొందరు రైతులు తరువాత వచ్చే వ్యవసాయానికి అవసరమైన యూరియా నిల్వ చేసుకోవడం కొరతకు కారణం అవుతోంది. పరిమితికి మించి భూమిలో యూరియా వాడటం వల్ల భూసారం తగ్గి చౌడు భూములుగా మారే ప్రమాదం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు నేలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. వంట ఏపుగా పెరగడం వల్ల చీడపీడలు పెరిగే అవకాశం ఉంది. అవసరాలకు మించి వేసినా అనర్ధాలే ఎక్కువ అవుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యూరియాను తగిన మోతాదులోనే వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
బ్లాక్‌ మార్కెటింగ్‌ను నియంత్రించాలి
ప్రభుత్వ యంత్రాంగం ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలి. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోపోవడమే యూరియా కొరతకు కారణం. ఎరువుల దుకాణాలను తరచూ తనిఖీ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అనేటట్లుగా చర్యలు చేపట్టాలి. రైతులు, రైతు సంఘాలతో

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img