Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రణరంగంగా శ్రీలంక

ప్రధాని నివాసంపై దండయాత్ర
అత్యయిక పరిస్థితి విధింపు
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్‌..

శ్రీలంక అత్యయిక పరిస్థితి విధించింది. దేశ అధ్యక్షుడిగా రాజీనామా చేయాల్సిన బుధవారమే మాల్డీవులకు పారిపోయాడన్న వార్త దావనంలా వ్యాపించడంతో.. ఆందోళనకారులు మళ్లీ రోడ్డెక్కారు.ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ర్యాలీగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ప్రధాని నివాసానికి 200 మీటర్ల దూరం నుండి గుంపుగా నిరసనకారులు ఆందోళనలు చేపడుతున్నారు. వీరిని అదుపు చేసేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ను భద్రతా దళాలు వినియోగించాయి. భాష్ప వాయువులు ప్రయోగించినా.. ప్రధాని నివాస ప్రాంగణంలోకి ప్రవేశించి.. ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నివాసం ఎదుట పెద్దయెత్తున ఆందోళనకారులు గుమిగూడారు. తాము పార్లమెంట్‌కు కూడా ర్యాలీ చేపడతామని, అధ్యక్షుడు పదవీవిమరణ చేసేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఓ వైపు రణిల్‌ విక్రమ్‌సింఘే ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని, అధ్యక్ష పదవిలో కూర్చోవద్దని నిరసనకారులు ఆందోళన చేస్తుంటే ఆయన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్‌ మహింద అభయవర్థన నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ప్రస్తుత అధ్యక్షుడు గొటబాయ ఇంతవరకు రాజీనామా చేయలేదు. ఆయన దేశంలో లేకపోవడంతో ప్రస్తుత నియామకం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img