Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాజీనామా చేయకుండా దేశాలు దాటుతున్న గొటబాయ

శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సింగపూర్‌కు బయల్దేరారని శ్రీలంక మీడియా సంస్థలు వెల్లడిరచాయి. ఆయన పరారీ తర్వాత.. దేశంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.గొటబయ, ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఫ్‌ు రాజీనామా చేయాలని.. రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేపట్టారు. నిన్న గొటబాయ దేశం దాటి మాల్దీవులకు వెళ్లారనే వార్తలు ఆందోళకారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దాంతో నిన్న మరోసారి తమ నిరసనలు ఉధృతం చేశారు. దాంతో ఆ దేశ తాత్కాలిక అధక్షుడిగా నియమితులైన రణిల్‌ విక్రమ్‌ సింఫ్‌ు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఓ వైపు దేశంలో పరిస్థితి ఇలా ఉంటే గొటబాయ మాత్రం దేశాలు దాటుతున్నారు. ప్రస్తుతం ఆయన సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానంలో తమ దేశం నుంచి వెళ్లిపోయారని మాల్దీవుల అధికారులు వెల్లడిరచారు. ఆ విమానంలో తొలుత సింగపూర్‌, ఆ తర్వాత సౌదీ అరేబియాకు చేరుకోనున్నారని సంంధిత వర్గాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img