Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజ్‌భవన్లకు కదం తొక్కుదాం

. అన్ని రాష్ట్రాలకు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు
. నవంబరు 26కు చరిత్రాత్మక రైతు ఉద్యమానికి రెండేళ్లు
. 14న దిల్లీలో భేటీ`తదుపరి కార్యాచరణపై నిర్ణయం

న్యూదిల్లీ : సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఆధ్వర్యంలోని చరిత్రాత్మక రైతాంగ ఉద్యమానికి నవంబరు 26వ తేదీకి రెండేళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ వరకు మార్చ్‌ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు ఎస్‌కేఎం పిలుపునిచ్చింది. ఇదే క్రమంలో నవంబరు 14న దిల్లీలో ఎస్‌కేఎం సమావేశం జరగనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో రైతు నేతలు దర్శన్‌పాల్‌, హన్నన్‌ మొల్లా, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రాహన్‌, యుధ్వీర్‌ సింగ్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాజ్‌భవన్‌ వరకు మార్చ్‌ నిర్వహణ, గవర్నర్లకు వినతిపత్రాలు అందజేయడం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. అలాగే, సమన్వయ కమిటీ`ముసాయిదా కమిటీ సభ్యుల మధ్య చర్చల గురించీ సంప్రదింపులు జరుపుతామని నేతలు తెలిపారు. మంగళవారం జరిగిన ఎస్‌కేఎం సమావేశంలో దర్శన్‌ పాల్‌, హన్నన్‌ మొల్లా, జోగిందర్‌ సింగ్‌తో పాటు మేధా పాట్కర్‌, రాజారామ్‌ సింగ్‌, అతుల్‌ కుమార్‌ అంజాన్‌, సత్యావన్‌, డాక్టర్‌ అశోక్‌ ధవాలే, అవిక్‌ సహా, సుఖ్‌దేవ్‌ సింగ్‌, రమిందర్‌ సింగ్‌, వికాస్‌ శిషిర్‌, డాక్టర్‌ సునీలమ్‌ పాల్గొన్నారు. అటవీ సంరక్షణ చట్ట నిబంధనల్లో కేంద్రప్రభుత్వం చేస్తున్న సవరణలను సమావేశం ఖండిరచింది. ఉద్యమనేత బిర్సాముండా జయంతిని పురస్కరించుకొని తమ సంఫీుభావాన్ని నవంబరు 15న తెలపాలని నిర్ణయించింది. బిర్సా ముండా ఆదివారీ ఉద్యమనేత, వారి హక్కుల కోసం పాటుపడ్డారని గుర్తుచేసింది. రైతు నేత పరంజీత్‌ సింగ్‌ మరణానికి సంతాపం ప్రకటించింది. ఈయన 380 రోజుల రైతుల ఉద్యమానికి ఎంతో తోడ్పడ్డారని ఎస్‌కేఎం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img