Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రానున్న రోజులు చాలా కీలకం..


మరింత అప్రమత్తం కావాలి : కేంద్రం
కొవిడ్‌పై పోరులో రానున్న వంద రోజుల నుంచి 125 రోజులు చాలా కీలకం కానున్నాయని,అత్యంత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది. కరోనా నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం వద్దని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించాలని సూచించింది. సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందని, అందువల్ల దీన్ని మనం సంకేతంగా తీసుకోవాలని నీతి ఆయోగ్‌ (హెల్త్‌) సభ్యుడు డా.వీ.కె.పాల్‌ తెలిపారు. ఒక విధంగా ఇది మనకు హెచ్చరిక అని పేర్కొన్నారు. సెకండ్‌ వేవ్‌ తగ్గిందనుకున్నా..మూడో వేవ్‌ రాదన్న గ్యారంటీ ఏదీ లేదన్నారు. దీన్ని నివారించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్టు చెప్పారు. జులై ముగిసేలోగా 50 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. కాగా థర్డ్‌ వేవ్‌లో ఆగస్టు నెలలో రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్‌ నిపుణుడు డా. సమిరన్‌ పాండే వెల్లడిరచారు. అప్పుడు పరిస్థితి తొలి వేవ్‌ మాదిరి ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్‌ వైరస్‌ మరింతగా రొటేట్‌ అయ్యే ప్రమాదం ఉందని.. ఈ కారణంగా కేసులు పెరగవచ్చునని ఆయన చెప్పారు. అందువల్లే ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img