Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను : అఖిలేశ్‌ యాదవ్‌

రాబోయే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల 2022 లో పోటీ చేయడం లేదని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. తాను చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నానని.. రాష్ట్రీయ లోక్‌దళ్‌తో పొత్తు ఖరారైందని చెప్పారు. సీట్ల పంపకం గురించి ఇంకా మాట్లాడలేదని చెప్పారు. మరోవైపు అఖిలేష్‌ యాదవ్‌ పాక్‌ జాతిపిత మహమ్మద్‌ ఆలీ జిన్నాను స్వాతంత్య్ర సమరయోధుడిగా కొనియాడారు. ఆదివారం హర్ధోయ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సర్ధార్‌ పటేల్‌, మహాత్మా గాంధీ, నెహ్రూ, జిన్నా ఒకే సంస్థలో చదివి న్యాయవాదులయ్యారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. పోరాటానికి వారు ఎన్నడూ వెనుదిరగలేదు.’’ అని పేర్కొన్నారు. కాగా జిన్నాను అఖిలేశ్‌ పొగడడంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఎదురుదాడికి దిగారు. పటేల్‌ను జిన్నాతో పోల్చడం సిగ్గుచేటని సీఎం యోగి అన్నారు. అఖిలేష్‌ యాదవ్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విభజన మనస్తత్వాన్ని ప్రజలు అంగీకరించరని.. ఎస్పీ జాతీయ అధ్యక్షుడి ప్రకటన చాలా సిగ్గుచేటని అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారతదేశ ఐక్యత, సమగ్రతకు రూపశిల్పి అని వెల్లడిరచారు. ఇదీ తాలిబనీ మనస్తత్వం అని సీఎం యోగి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img