Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

రాబోయే 40రోజులు కీలకం.. జనవరిలో కరోనా కేసులు పెరిగే ఛాన్స్‌

రాబోయే 40రోజులు కీలకమని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు హెచ్చరించారు. కాగా ఇండియాలో జనవరి నెలలో కోవిడ్‌ కేసులు పెరిగే ఛాన్స్‌ ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.కాగా కొత్త వేవ్‌ వచ్చినా, దాని తీవ్రత అధికంగా ఉండదని చెప్పారు.అలాగే ఇంత వరకు లోపభూయిష్టమైన జీరో కోవిడ్‌ విధానాన్ని అనుసరించిన చైనాతో పోలిస్తే మన దేశంలో ఇప్పటికే చాలా మంది టీకాలు వేసుకున్నారు. దీంతో అధిక శాతం జనాభాకు హైబ్రిడ్‌ రోగనిరోధక శక్తి వచ్చింది. కాబట్టి హాస్పిటల్‌ లో చేరికలు, మరణాలు అధికంగా ఉండే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. పూర్వం ఆసియాలో వేవ్‌ కనిపించినప్పుడల్లా 35-40 రోజుల్లో భారతదేశాన్ని కొత్త వేవ్‌ లు తాకడం గతంలో మనం చూసిన ధోరణి’’ అని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ సబ్‌ -వేరియంట్‌ బీఎఫ్‌ 7 విజృంభించడం, ముఖ్యంగా చైనాలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో స్క్రీనింగ్‌ చేసిన 6,000 మందిలో 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కోవిడ్‌ -19 కు పాజిటివ్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img