Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రపతి బరిలో ముర్ము, సిన్హా

మిగతా అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

న్యూదిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే పోటీలో ఉన్నారు. మిగిలిన వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 29వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఎన్డీయే తరఫున ఒడిశాకు చెందిన గిరిజన మహిళ, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్వర్థిగా బీజేపీ మాజీ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. అధికార, విపక్షాల అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (రాజ్యసభ సెక్రటరీ జనరల్‌) పీసీ మోదీ గురువారం తెలిపారు. మొత్తం 94 మంది అభ్యర్థుల నుంచి 115 నామినేషన్లు రాగా అందులో 107 ప్రమాణాలు పాటించనందున తిరస్కరిం చారన్నారు. 26 మందికి సంబంధించిన 28 నామినేషన్‌లు దాఖలప్పుడే తిరస్కరిం చగా 72 మంది అభ్యర్థుల 87 నామినేషన్‌లను బుధవారం తిరస్కరించినట్లు తెలిపారు. ద్రౌపది ముర్ము, యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ పత్రాలు మాత్రమే ఒక్కొక్క టి నాలుగు సెట్లు ఉన్నాయని, ఆమోదం పొందాయని అన్నారు. నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీ జూలై 2 మధ్యాహ్నం 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను గెజిట్‌లో ప్రచురిస్తామని ఆయన చెప్పారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగనున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img