Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రానికి తుపాను గండం

. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
. అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడనున్నట్లు ఐఎండీ వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి తుపాను గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మరో మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమేపీ అల్పపీడనంగా మారి వాయుగుం డంగా బలపడనుందని, ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ తుపానుకు మోచాగా నామకరణం చేశారు. ప్రస్తుతానికి ఇది పశ్చిమ బెంగాల్‌, మయన్మార్‌ వైపు పయనిస్త్తోం దని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మత్య్స కారులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా, రాయలసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజులు కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లా, రాయలసీమ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షాల కంటే ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఐఎండీ హెచ్చరికలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ధాన్యం కళ్ళాల్లోనే తడిసి పోతోంది. తీసి ఆరబెట్టడానికి కూడా వీల్లేకుండా వర్షాలు పడుతున్నాయి. అలాగే మొక్కజొన్న మొలకలెత్తుతోంది. మిరప, అరటి, బొప్పాయి, మామిడి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథó్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నష్టనివారణకు ముందస్తు చర్యలు చేపడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img