Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్‌ టీకాలు

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడి
ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమకూర్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. మరో 77,93,360 వ్యాక్సిన్‌ డోసులు మార్గమధ్యంలో ఉన్నాయని, త్వరలో అవి కూడా రాష్ట్రాలకు చేరుకుంటాయని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 5.31 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 69,51,79,965 వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమకూర్చినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 5,31,15,610 వినియోగించని వ్యాక్సిన్‌ డోసులు ఉన్నాయని పేర్కొంది.
కాగా ప్రధాని మోదీ నాయకత్వంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గడిచిన 13 రోజుల్లోనే పది కోట్ల మంది కోవిడ్‌ టీకాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడిరచారు. ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘనత సాధించినందుకు హెల్త్‌ వర్కర్లకు, ప్రజలకు మంత్రి మాండవీయ థ్యాంక్స్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img