Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రాహుల్‌ ‘పాక్‌, చైనా’ వ్యాఖ్యలు..స్పందించిన అమెరికా

భారత విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ఫ్రైస్‌ తెలిపారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో బీజేపీ లక్ష్యంగా చేసుకుని రాహల్‌ విమర్శలు చేశారు. ‘‘భారత వ్యూహాత్మక లక్ష్యం.. చైనా, పాకిస్థాన్‌ ను వేరు చేయడమే. కానీ, మీరు ఆ రెండూ ఏకమయ్యేలా చేశారు. మనం ఎదుర్కొంటున్న ముప్పును తక్కువ అంచనా వేయరాదు. భారత్‌కు ఇది తీవ్రమైన ముప్పు.’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నెడ్‌ ఫ్రైస్‌ను మీడియా ప్రశ్నించగా, పాకిస్తాన్‌, పీఆర్‌సీ (పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా) మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నా. అయితే ఆ వ్యాఖ్యలను మేం కచ్చితంగా సమర్థించలేము అని సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img