Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. సూరత్ కోర్టు సంచలన తీర్పు


ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్దారించింది. మోదీ ఇంటిపేరుకు సంబంధించి ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ.. మోదీ అనే ఇంటిపేరుగల వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సూరత్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ప్రధానిని రాహుల్ గాంధీ కించపరిచేలా మాట్లాడారంటూ ఆరోపించారు.ఈ కేసులో 30 రోజులు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. అప్పీల్‌కు అనుమతించింది. మరోవైపు, రాహుల్ గాంధీకి మద్దతుగా నగరంలోని వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సమావేశమయ్యారు. ఆయనను షేర్-ఇ-హిందూస్థాన్ (హిందూస్థాన్ సింహం),బీజేపీ నియంతృత్వం ముందు కాంగ్రెస్ తలవంచదు్అ నే పోస్టర్లు అతికించారు.ాదొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అనే ఆరోపణలపై గాంధీపై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదుపై వ్యాఖ్యలు చేశారు.గతంలో ఈ కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీన.. ప్రధాని మోదీ ఓ వ్యాపారవేత్తకు 30 లక్షలు ఇచ్చారని మీరు ఆరోపించారా? అని మేజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు.. ఒక జాతీయ నేతగా తాను అవినీతి నిరుద్యోగం వంటి అంశాలపై గళమెత్తుతూనే ఉంటానని చెప్పారు. మోదీ ఇంటిపేరుగల వ్యక్తులంతా దొంగలేనని మీరు నాడు అన్నారా? అన్న ప్రశ్నకు తాను అలంటి పదాలు వాడలేదని, మిగతా ప్రశ్నలకు ఆయన తనకు తెలియదని సమాధానమిచ్చారు.కోలార్ ర్యాలీ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అని ప్రస్తావిస్తూ వీరందరికీ ఒకే ఇంటిపేరు ఎలా ఉంటుందన్నారు. దొంగలందరికీ ఇది ఇంటిపేరా? అని ప్రశ్నించారు. సత్యాన్ని పరీక్షిస్తారు.. వేధిస్తారు, కానీ ఎప్పటికైనా నిజం మాత్రమే గెలుస్తుంది.. రాహుల్ గాంధీపై అనేక తప్పుడు కేసులు పెట్టారు, కానీ వీటన్నింటి నుంచి అతను బయటపడతారు. మాకు న్యాయం జరుగుతుంది్ణ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా గురువారం వ్యాఖ్యానించారు. గతవారం ఈ కేసులో వాదనలు ముగించిన కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది. రాహుల్‌ను దోషిగా నిర్దారిస్తూ గురువారం ఉదయం తీర్పు వెలువరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img