Friday, April 19, 2024
Friday, April 19, 2024

రూ 10 లక్షల వరకూ ఉచిత వైద్యం : ప్రియాంక గాంధీ

యూపీ ఓటర్లకు ప్రియాంక గాంధీ మరో కీలక హామీ

త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హామీల వర్షం కురిపిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే, రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని అందజేస్తామని ప్రియాంక గాంధీ ఓ ట్వీట్‌ ద్వారా హామీ ఇచ్చారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దయనీయ పరిస్థితులు తలెత్తడం అందరూ చూశారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి అధికారాన్ని అప్పగిస్తే రూ.పది లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని తమ ప్రభుత్వం కల్పింస్తుందని ప్రకటించారు. కొవిడ్‌-19 బాధితులకు ఊతంగా బాధిత కుటుంబానికి రూ 25,000 పరిహారం ఇస్తామని ఆమె ఇప్పటికే వెల్లడిరచారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు మహిళలకు కేటాయిస్తామనీ ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రియాంక శనివారం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ నుంచి కాంగ్రెస్‌ ప్రతిజ్ఞ యాత్రలను ప్రారంభించారు. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు అందిస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, 20 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి తీసుకువస్తామని పలు హామీలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img