Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రూ.300 కోట్ల నల్లధనం

రాంకీకి ఐటీ షాక్‌
దాడుల్లో లెక్కచూపని నగదు గుర్తింపు
మెజార్టీ ఆస్తులు సింగపూర్‌ కంపెనీకి తరలింపు
ఎగవేసిన పన్ను చెల్లింపునకు అంగీకారం

న్యూదిల్లీ :
హైదరాబాద్‌కు చెందిన రాంకీ గ్రూపు సంస్థల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించి రూ.300 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం తెలిపింది. ‘సోదాలు, స్వాధీన ఆపరేషన్‌లో గుర్తించిన వేర్వేరు నకిలీ పత్రాల ఆధారంగా ఆ సంస్థ సిబ్బంది రూ.300 కోట్ల లెక్కచూపని నగదును కలిగి ఉన్నట్లు అంగీకరించారు. తగిన పన్నులు చెల్లించడానికి కూడా వారు అంగీకరించారు’ అని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాక్‌ మార్కెట్లతోపాటు ఇతర లావాదేవీల ద్వారా ఈ నగదును నిర్వహించినట్లు వెల్లడిరచింది. వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూపులోని అనేక సంస్థల కార్యాలయాలలో ఈ నెల 6వ తేదీన ఐటీ అధికారులు 15 బృందా లతో సోదాలు నిర్వహించారు. ఇందులో భారీ ఎత్తున నగదును గుర్తించారు. దాదాపు రూ.1,200 కోట్ల కృత్రిమ నష్టాలను చూపి నట్లు, ఇందులో భారీగా పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటిని పరిశీలించినప్పుడు లెక్కలు చూపని రూ.300 కోట్ల ఆదాయం బయటపడినట్లు ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ, నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో ఈ గ్రూపు పని చేస్తోంది. దేశవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణ కార్యకలాపాలు చేపడుతుం డగా, హైదరాబాద్‌లో ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌ పైన మాత్రమే ఈ గ్రూపు దృష్టి సారించినట్లు సీబీడీటీ తెలిపింది. ‘ఈ గ్రూపు తన మెజార్టీ వాటాను సింగపూర్‌లోని ఒక ప్రవాస సంస్థకు అమ్మేసింది. 2018`19 ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూపు భారీ లాభాలను ఆర్జించింది. అదే సమయంలో సంబంధిత పార్టీలతో వాటా కొనుగోలు, అమ్మకం, విస్తృత విలువైన చందా, తదుపరి బోనస్‌ జారీ మొదలైన వాటిలో ప్రవేశించడం ద్వారా వివిధ రంగుల పథకాలను రూపొందించింది. అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు నిరూపించే అనేక పత్రాలను ఐటీ శాఖ స్వాధీనం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img