Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించిన ప్రియాంక గాంధీ

రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించిన ప్రియాంక గాంధీ
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్ భూష‌ణ్‌ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని టాప్ రెజ్లర్లు ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్‌ వద్ద చేస్తున్న ధ‌ర్నా కొనసాగుతోంది. ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారులు, రైతు సంఘాల నేతలు మద్దతు తెలిపారు. తాజాగా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉదయం రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా టాప్‌ రెజ్లర్లు తమ సమస్యలను ప్రియాంకకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిపోర్టు కాపీని ఎందుకు బయటపెట్టడం లేదని ఢిల్లీ పోలీసులను ఆమె ప్రశ్నించారు. ాదేశానికి పతకాలు తీసుకొచ్చి మనందరికీ గర్వకారణంగా నిలిచిన రెజ్లర్లు ఇలా రోడ్డు మీద ఆందోళన చేయాల్సి రావడం చాలా దురదృష్టకరం. ఇక్కడున్న మహిళా రెజ్లర్లు అందరూ ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో అవరోధాలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు గొంతెత్తడం అభినందనీయం. వీరి ఆందోళనకు యావత్‌ దేశం అండగా నిలుస్తుంది్ణ అని ప్రయాంక గాంధీ అన్నారు.ాబ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశామన్న ఢిల్లీ పోలీసుల ప్రకటన నమ్మశక్యంగా లేదు. ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇంత వరకూ ఆ కాపీలను బయటకు చూపించలేదు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ఎందుకు బయటపెట్టల్లేదు..? న్యాయం కోసం ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్ల ఆవేదనను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? ఈ విషయంలో బ్రిజ్‌ భూషణ్‌ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోంది..? వీరి సమస్యను ప్రధాని మోదీ (ూఎ వీశీసఱ) పరిష్కరిస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ వీరి గురించి ఆయన ఆందోళన చెంది ఉంటే.. ఇంతవరకూ రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలవడానికి కూడా ప్రయత్నించలేదు్ణ అని ప్రియాంక మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img