Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతన్న కన్నెర్ర – వరి కొనుగోలులో జాప్యంపై ఆగ్రహం

పంజాబ్‌, హరియాణావ్యాప్తంగా నిరసనలు
ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు
కేంద్రం వైఖరిపై నిప్పులు

కేంద్రంలోని మోదీ సర్కార్‌ వైఖరికి నిరసనగా రైతుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. పంజాబ్‌, హరియాణాలో రైతులు శనివారం వరి సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో ధర్నాలు నిర్వహించారు. వరి పంట కొనుగోలులో జాప్యంపై నిరసన తెలియజేసేందుకు రెండు
రాష్ట్రాల్లో శాసనసభ్యుల నివాసాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా శుక్రవారం పిలుపునిచ్చింది.

చండీగడ్‌ : కేంద్రంలోని మోదీ సర్కార్‌ వైఖరికి నిరసనగా రైతుల్లో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. పంజాబ్‌, హరియాణాలో రైతులు శనివారం వరి సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ అనేక ప్రాంతాలలో ధర్నాలు నిర్వహించారు. వరి పంట కొనుగోలులో జాప్యంపై నిరసన తెలియజేసేందుకు రెండు రాష్ట్రాల్లో శాసనసభ్యుల నివాసాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా శుక్రవారం పిలుపునిచ్చింది. ఇటీవల భారీ వర్షాల కారణంగా పంట పరిపక్వత ఆలస్యమవడంతోపాటు తాజా రాకలో తేమ శాతం అనుమతించదగిన పరిమితులను మించి ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 11 వరకు పంజాబ్‌, హరియాణాల్లో ఖరీఫ్‌ వరి సేకరణను వాయిదా వేసింది. కాగా రాష్ట్రాలకు చెందిన సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఈ వరి పంట సేకరణ చేపడతాయి. వరి సేకరణ సాధారణంగా అక్టోబరు 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ శనివారం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ‘రోజు రోజుకు హింసాత్మకం’గా మారుతుందని అన్నారు. ‘రైతుల నిరసన రోజు రోజుకు హింసాత్మకంగా మారుతోంది. మహాత్మా గాంధీ దేశంలో హింసను అనుమతించలేదు’ అని విజ్‌ ఒక ట్వీట్‌ చేశారు. మరోవైపు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వరి పంట కొనుగోలును ప్రారంభించవల సిందిగా కేంద్రాన్ని కోరారు. ‘పంజాబ్‌ రైతులు కలత చెందారు. కేంద్ర ప్రభుత్వం 10 రోజులపాటు వరి కొనుగోలును వాయిదా వేసింది. రైతులు తమ ట్రాక్టర్లపై లక్షల క్వింటాళ్ల వరితో మండీల వెలుపల వేచి ఉన్నారు’ అని కేజ్రీవాల్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లో రైతులు రూప్‌నగర్‌లో పంజాబ్‌ విధాన సభ స్పీకర్‌ రాణా కె.పి.సింగ్‌, మోగాలో ఎమ్మెల్యే హర్జోత్‌ కమల్‌ సహా అనేక మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నివాసాల ఎదుట నిరసనకు దిగారు. తక్షణమే వరి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అయితే ధాన్యం మార్కెట్లలో తమ పంటను కొనుగోలు చేయకపోతే తాము నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరి పంట తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ మండీలకు రావడం ప్రారంభమైంది. ప్రత్యేకించి పంజాబ్‌ సరిహద్దు ప్రాంతాల్లో మండీలకు వచ్చిందని రైతులు తెలిపారు. తమ పంటను కొనుగోలు చేయకపోతే ఎక్కడికి తాము ఎక్కడికి వెళ్లాలని మండీలకు పంటను తీసుకువచ్చిన రైతులు ప్రశ్నించారు. ప్రైవేటు వ్యాపారులకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వస్తుందేమోనని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
హరియాణాలోని కర్నాల్‌కు చెందిన రైతులు ఒకరు మాట్లాడుతూ కేంద్రం సేకరణ ప్రారంభించే అక్టోబరు 11 నాటికి తన వరి పంట పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్‌, హరియాణాల్లో నిరసనల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్తోaల రైతులు వరి కొనుగోలును ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ డిప్యూటీ కమిషనర్లకు వినతి పత్రాలను సమర్పించారు. హరియాణాకు చెందిన అంబాలాలో, బీజేపీ శాసనసభ్యుడు అసీమ్‌ గోయెల్‌ నివాసాన్ని రైతులు ముట్టడిరచకుండా అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నివాసం వెలుపల అగ్నిమాపక వాహనాన్ని, జల ఫిరంగులు ప్రయోగించే ఒక వాహనాన్ని మోహరించారు. అలాగే అంబాలా కంటోన్మెంట్‌ వద్ద మంత్రి విజ్‌ నివాసం వెలుపల గట్టి భద్రతా ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img