Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైతుకు వెన్నుపోటు

అక్కరకురాని ఫసల్‌ బీమా యోజన
. ప్రభుత్వ లెక్కలపై అనుమానం
. పంట నష్టాలపై తప్పుడు నివేదికలు
. క్లయిమ్‌ తగ్గించే ప్రయత్నాలు

న్యూదిల్లీ : రైతన్నపై ప్రక్రృతి కన్నెర్ర చేసింది. అకాల వర్షాలు ముంచెత్తుతుంటే కరవు కాటేస్తోంది. పంటకు భారీగా నష్టం వాటిల్లితోంది. కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలకు పరిమితం అవుతున్నాయి. పూర్తిస్థాయిలో సహాయంబీమా మొత్తాలను అందించడం లేదు. అదీ కూడా కొందరికే అందుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. నిస్సాయులుగా మారుతున్నారు. పంట నష్టంపై సర్వేలు లేకుండా నష్టాన్ని అంచనా వేయకుండా తప్పుడు నివేదికలు చూపి క్లెయిమ్‌ను ప్రభుత్వం తగ్గిస్తున్నట్లు అన్నదాతలు విమర్శిస్తున్నారు. సత్వరమే సాయం అందకపోతే మరింత నష్టపోతామని వాపోతున్నారు. రైతు ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారన్న లెక్క లేకుండా ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున కొందరికి ప్రభుత్వం అందించిన సాయం అక్కరకు రావడం లేదన్నారు.
మధ్యప్రదేశ్‌ బీజేపీ పాలిత రాష్ట్రమే అయినా ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన అమలు సక్రమంగా జరగడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ డేటా సందేహాదాస్పదంగా ఉన్నదని రైతులు తెలిపారు. చాలా మంది రైతులకు తగిన పరిహారం లభించలేదన్నారు. రైతుకు రూ.5000 చొప్పున ఇచ్చారుగానీ చాలా మందికి ప్రభుత్వ సాయం అందించలేదు. బీమా మొత్తాన్ని దోచుకొనే ప్రయత్నాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన వంతు చేయకపోవడంతో తనతో పాటు నష్టపోయిన రైతులు నిస్సహాయులయ్యారని చెప్పారు. కిసాన్‌ రుణకార్డులపై అప్పు పొందిన ప్రతీసారీ బీమా ప్రీమియాలు వెంటనే మినహాయించి బీమా కంపెనీలకు ఇచ్చేస్తారుగానీ పంటలకు నష్టం వాటిల్లితే బీమా డబ్బు ఇవ్వడం లేదని మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు సుమేర్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. పంట నష్టంపై తప్పుడు నివేదికలను చూపుతూ క్లెయిమ్‌ (దావా)లను తగ్గించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. పంట నష్టాలపై సర్వేలు జరగలేదని తెలిపారు. బీమా ప్రయోజనం రూపేణ పొందినది ఇన్‌పుట్‌ వ్యయం మాత్రమేగానీ పంట విలువ కాదన్నారు. ఈ పథకం కింద ఇచ్చిన హామీ మేరకు రైతుకు సాయం అందడం లేదని సుమేర్‌ సింగ్‌ వెల్లడిరచారు.
రుతుపవనాల అస్థిరత రైతుల కష్టాలు మరింత పెంచింది. పొడిభూముల్లో పండే సోయాబీన్‌, మినపప్పు, పెసరపప్పు, సజ్జల సాగుకు తీవ్ర నష్టం జరిగింది. సాగుకు అనుకూలమైన వాతావరణం లేక అకాలంగా అధిక వర్షాలు కురవడంతో ఖరీఫ్‌ పంటలకు పాక్షికంగా లేదా సంపూర్ణంగా నష్టం వాటిల్లింది. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పంట విస్తీర్ణం తగ్గి దిగుబడి పడిపోయింది. కోస్తా బెల్ట్‌లోని సారవంతమైన నేలలోనూ పంటలు బాగా పండే పరిస్థితి లేదు. అధిక వర్షం వల్ల నువ్వులు, నూనెగింజల సాగు ప్రభావితమైంది. దక్షిణాదిలో కల్యాణ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో అధిక వర్షం ఫలితంగా 11 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. సజ్జలు, మిరప, జొన్నలు, చిక్కుళ్లు, నూనెగింజల పంటలు దెబ్బతిన్నాయి. వరిసాగు 4.52శాతం తగ్గింది.
తాజా పరిస్థితుల్లో వ్యవసాయ సంక్షోభాన్ని అంచనా వేసేందుకు ఐసీఏఆర్‌అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌ సింగ్‌తో ‘ది వైర్‌’ మాట్లాడిరది. వర్షాలు, పంట నష్టాలపై ఆరా తీసింది. చాలా ప్రాంతాల్లో మినుములు, సోయాబీన్‌, పెసర, నువ్వుల పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్లు నివేదికలు చెబుతున్నాయని సింగ్‌ తెలిపారు. కోటా ప్రాంతంలోని నల్లమట్టి నేలల్లో 400 ఎంఎంల అధిక వర్షపాతం నమోదు అయిందని, భారీగా పంట నష్టం జరిగిందని, చాలా వరకు సాగుదారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా వరి రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందన్నారు. నివేదికల ప్రకారం మినుములు 20శాతం మేర పంట నష్టం వాటిల్లింది. 1520శాతం సోయా పంట దెబ్బతిన్నది. జైపూర్‌అజ్మీర్‌ బెల్ట్‌లో అధిక వర్షాలతో నవ్వుల పంట నాశమైంది’ అని సింగ్‌ వెల్లడిరచారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోని పొడి నేలల్లో పండే నవ్వులు, సోయాకు భారీగా నష్టం జరిగింది. మధ్యభారతంలో రైతులు మినప సాగు కోసం విత్తనాలు వేయగా వర్షాలకు కొట్టుకుపోయాయి. వర్షాల దెబ్బకు మినప పప్పు పంట విస్తీర్ణం తగిందని సింగ్‌ తెలిపారు. రాజస్థాన్‌లో పంట విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో పంట ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందిగానీ ఎకరా దిగుబడి దెబ్బతింటుందన్నారు. కోత తర్వాత సజ్జల పంటకు నష్టం వాటిల్లినట్లు నివేదికలు వచ్చాయి. కోత తర్వాత సజ్జలను చాలా వరకు పొలాల్లోనే రైతులు ఉంచుతారు. అకాల వర్షాలతో పంట కుళ్లిపోయింది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. సరిహద్దు గ్రామాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా అధిక వర్షాలు ముంచెత్తుతున్నాయని స్థానిక రైతు సుమేర్‌ సింగ్‌ గర్హ తెలిపారు. పార్వతి నదికి వరదలు రావడంతో కొన్ని గ్రామాల్లో 5060 అడుగుల మేర నీరు నిండి 90శాతం పంటలు దెబ్బతిన్నాయని, వాటిలో సోయా, మినప, మొక్కజొన్న వంటివి ఉన్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img