Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైతులకు మిర్చి ఘాటు

. వర్షాలకు దెబ్బతిన్న పంట
. ట్రాక్టర్‌తో దున్నేసిన రైతులు

విశాలాంధ్ర`విడపనకల్లు : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు కనీసం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నలు వరుస నష్టాలను చవిచూస్తున్నారు. పంట ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రతి ఏడాది ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో లాభాలను ఆర్జించవచ్చుననే గంపెడాశతో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా పంట దిగుబడి విపరీతంగా రావడం, కరోనా తదితర కారణాలతో ధరలు పతనమయ్యాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం ఉండ బండ గ్రామ పొలంలో రైతు రేగటి గోవిందు ఆరు ఎకరాల పొలంలో మిరప పంట సాగు చేసి రెండున్నర నెలల పైరును శుక్రవారం స్వయంగా మిరప మొక్కలను పీకివేశాడు.
భారీ వర్షాల వల్ల మిరప పంట పూర్తిగా నష్టపోయిందని ఆవేదన చెందాడు. ఎకరాకు 50 వేల చొప్పున ఇప్పటికే మూడు లక్షల పైగా ఖర్చుపెట్టాననీ, పంట పూర్తిగా దెబ్బతిన్నందున ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఎస్‌ గోవింద్‌ అనే మరో రైతు కూడా మూడెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే భారీ వర్షాల వలన మిరపపంట పూర్తిగాదెబ్బతినడంతో సాగు చేసిన పంట తొలగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img