Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతు ఆత్మహత్యలు ఏపీ ఏ3

మొదటి రెండు స్థానాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర
తెలంగాణలో బాగా తగ్గిన బలవన్మరణాలు
పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటన

న్యూదిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాలు కర్ణాటక, మహా రాష్ట్రల్లో రైతుల ఆత్మహత్యలు బాగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. రైతుల ఆత్మహత్యల్లో కర్ణాటక, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడిరచింది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్లు తెలిపింది. కాగా, తమది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ధ్యేయమని, వ్యవసాయాన్ని పండుగలా మార్చామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓవైపు గొప్పగా చెప్పుకుంటుంటే…గతంలో కంటే ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి తోమరÊ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్‌ మూడోస్థానంలో ఉందని తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినా…ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి తోమర్‌ చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో కర్ణాటక, మహారాష్ట్ర ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో 2017లో 375 మంది, 2018లో 365 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో దాదాపు రెట్టింపు సంఖ్యలో 628 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు. 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తోమర్‌ వివరించారు. పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. 2017లో తెలంగాణలో 846 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. 2021 నాటికి ఈ సంఖ్య 352కి తగ్గినట్లు మంత్రి తోమర్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img