Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రైలు టికెట్‌ కోసం క్యూలో నిలబడనక్కర్లేదు.. చాలా ఈజీగా మొబైల్‌లోనే

విజయవాడ రైల్వే స్టేషన్‌లో యూటీఎస్‌ విధానం
రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల కష్టాలకు చెక్‌ పెట్టారు అధికారులు. ఇకపై జనరల్‌ టికెట్‌ కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. రద్దీని తగ్గించేందుకు తీసుకొచ్చి సరికొత్త విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. క్యూ లైన్లలో నిలబడకుండా ఈజీగా టికెట్లు తీసుకునేందుకు అవకాశం దక్కింది. యూటీఎస్‌ యాప్‌తో ఈజీగా టికెట్‌ను పొందవచ్చు అంటున్నారు అధికారులు.
రైల్వేస్టేషన్లలో జనరల్‌ టికెట్టు కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించేందుకు యూటీఎస్‌ యాప్‌ను తీసుకొచ్చారు. విజయవాడ కమర్షియల్‌ అధికారులు యూటీఎస్‌ యాప్‌ను బాగా ప్రచారం చేశారు. దీంతో ప్రయాణికులు లైన్లో నిలబడి టికెట్లు తీసుకునే కష్టం తప్పింది. విజయవాడ విషయానికి వస్తే.. ముఖ్యంగా ఉదయం వేళల్లో రైల్వే స్టేషన్‌ నుంచి విశాఖపట్నం, చెన్నై, సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ప్రయాణికులు జనరల్‌ టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిలబడాల్సి వచ్చేది.
గంటల కొద్దీ క్యూ లైనులో నిలబడేవారు. ఒక్కొక్కసారి రద్దీ కారణంగా రైలు కూడా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు కొందరు టికెట్‌ తీసుకుని హడావిడిగా కదిలే రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రమాదాలూ జరిగేవి. ఇలా చాలా ఇబ్బందులు గతంలో ఎదురయ్యాయి. దీంతో రైల్వే అధికారులు ప్రయానికులు ఈ యూటీఎస్‌ యాప్‌ ఆలోచన చేశారు.విజయవాడ రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను ప్రయాణికులు తమ స్మార్ట్‌ ఫోన్‌లో ఉంచుకున్నారు. యూటీఎస్‌ యాప్‌ ద్వారా స్కాన్‌ చేసి నేరుగా టికెట్లు తీసుకుంటున్నారు. దశలవారీగా అన్ని ప్లాట్‌ఫారాలలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విజయవాడ స్టేషన్‌లో మొత్తం 5 బుకింగ్‌ కౌంటర్ల వద్ద వీటిని ఏర్పాటు చేయగా.. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత జనరల్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ తగ్గింది. మొత్తానికి ఈ యూటీఎస్‌ విధానం మంచి ఫలితాలను ఇస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img