Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రోడ్డెక్కిన ఉల్లి రైతు

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
గిట్టుబాటు ధర కల్పించాలి : రైతుల డిమాండు
కర్నూలు మార్కెట్‌యార్డు వద్ద ధర్నా : రైతు సంఘాల మద్దతు

కర్నూలు : కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు రోడ్డెక్కారు. తమ పంటను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. ఆరుగాలం కష్టపడి పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. కర్నూలు మార్కెట్‌యార్డ్‌వద్ద ధర్నాకు దిగడంతో రవాణాకు అంతరాయం ఏర్పడిరది. జిల్లాలో కర్నూలు, కల్లూరు, సీ బెళగల్‌, గూడూరు, దేవనకొండ, కోడుమూరు, కృష్ణగిరి, డోన్‌, పత్తికొండ, తుగ్గలి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల్లో రైతులు అత్యధికంగా ఉల్లిపంట సాగుచేస్తారు. ఎకరాకు కనీసం 70 వేల రూపాయలు పెట్టుబడి పెడతారు. ప్రకృతి కరుణించి అధిక వర్షాలు కురవకుండా వంట బాగా వస్తే రైతులకు పెట్టుబడులు అయినా వస్తాయి. ఒకవేళ పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధరలేకపోతే రైతుపెట్టిన పెట్టుబడి రానేరాదు. రైతు అప్పులపాలు కావడం ఖాయం. కనీసం కోత కూలి కూడా రాక కొన్నిసార్లు పశవుల మేతకు వదిలేసిన ఘటనలు లేకపోలేదు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటలు కోకొల్లలు. కర్నూలు మార్కెట్‌యార్డులో వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖరీఫ్‌లో జిల్లాలో ఉల్లి సాధారణ సాగు 17,956 హెక్టార్లు అయితే 2020లో జిల్లాలో రైతులు 15,101 హెక్టార్లు సాగు చేయగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో 13,018 హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. కరోనా కారణంగా వ్యాపారులు ఉల్లి కొనుగోలు నిలిపివేశారు. దీంతో డిమాండ్‌ లేక ఉల్లి ధరలు పడిపోయాయి. ఉల్లి పంటను కర్నూలు మార్కెట్‌కు తీసురావద్దంటూ మార్కెట్‌ యార్డు కార్యదర్శి చెప్పడంతో రైతుసంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఉల్లి పంట కుళ్లిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. గురువారం మార్కెట్‌లో ఉల్లి క్వింటా గరిష్టంగా రూ.500, కనిష్టంగా రూ.150 పలకడంతో రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్‌కు వచ్చిన ఉల్లిని కొనుగోలు చేయా లని, దళారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని, దళారుల మోసాలు అరికట్టాలని, కనీసం ఉల్లి క్వింటా 2 వేల రూపాయలకైనా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మార్కెట్‌లో ఉన్న ఉల్లి పంటను ప్రభు త్వమే కొనుగోలు చేయాలని ఏపీ రైతుసంఘం, సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. మార్కెట్‌యార్డు ఎదుట ఆందోళనకు దిగిన రైతులకు మద్దతు తెలిపారు. ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జన్నాథం, సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రామకృష్ణ, నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img