Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

లఖింపూర్‌ ఖేరి హింస కేసు

కోర్టు ముందుకు సిట్‌ చార్జిషీటు
న్యూదిల్లీ : లఖింపూర్‌ ఖేరి హింసాత్మక కేసులో కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆశిష్‌మిశ్రా సహా 14మంది నిందితులపై ప్రత్యేకదర్యాప్తు బృందం(సిట్‌) చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ చింతా రామ్‌ కోర్టులో సోమవారం చార్జిషీటు దాఖలు చేసింది. ఈ హింసలో 8మంది మృతి చెందిన విషయం విదితమే. చార్జిషీటులో ఆశిష్‌మిశ్రా, అంకిత్‌దాస్‌, నందన్‌ సింగ్‌ బిస్త్‌, సత్యం త్రిపాఠి అలియాస్‌ సత్యం, లతీఫ్‌ అలియాస్‌ కాలే, శేఖర్‌ భర్తీ, సుమిత్‌ జైస్వాల్‌, ఆశిష్‌ పాండే, లవకుశ రాణా, శిశుపాల్‌, ఉల్లాస్‌ కుమార్‌ అలియాస్‌ మోహిత్‌ త్రివేది, రింకు రాణా, ధర్మేంద్ర బంజారాలను నిందితులుగా పేర్కొంది. ఈ కేసులో ముందుగా 13 మంది నిందితులను సిట్‌ గుర్తించి…అరెస్టు చేసింది. సీనియర్‌ ప్రాసిక్యూషన్‌ ఆఫీసర్‌(ఎస్‌పీఓ) విలేకరులతో మాట్లాడుతూ సాక్ష్యాలు తారుమారు చేసినందుకుగాను సెక్షన్‌ 201 కింద వీరేంద్ర శుక్లాను 14వ నిందితుడిగా చార్జిషీటులో పేరు చేర్చినట్లు తెలిపారు. అయితే, శుక్లాను ఇంకా అరెస్టు చేయలేదు. మొత్తం 14మందిపైనా సీట్‌ చార్జిషీటు దాఖలు చేసిందని, ఇక విచారణ కొనసాగుతుందని యాదవ్‌ చెప్పారు. గతేడాది డిసెంబరు 3వ తేదీన ఆందోళన చేస్తున్న రైతులను మంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆశిష్‌మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఇందులో నలుగురు రైతులు, జర్నలిస్టు సహా మొత్తం 8 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img