Friday, April 19, 2024
Friday, April 19, 2024

లఖింపూర్‌ ఘటన.. కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలి

రాష్ట్రపతిని కలిసిన రాహుల్‌ బృందం
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ నేతల బృందం డిమాండ్‌ చేసింది. రాహుల్‌గాంధీ నేతృంత్వంలోని ఆ పార్టీ నేతల బృందం బుధవారం రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిసింది. లఖింపూర్‌ ఘటనపై రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసింది. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. అంతేకాక కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బృందంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌ ఉన్నారు.రాష్ట్రపతితో భేటీ అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ లఖింపూర్‌ ఖేరి ఘటనలో నిందితుడి తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని తొలగించాలని, అప్పుడే నిష్పాక్షిక విచారణ సాధ్యమవుతుందని రాష్ట్రపతికి వివరించామని చెప్పారు.లఖింపూర్‌ ఖేరిలో అక్టోబర్‌ 3న ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై కేంద్రమంత్రి కుమారుడిదిగా భావిస్తున్న ఎస్‌యూవీ ఢీకొట్టడంతో నలుగురు రైతులు మరణించగా ఆపై జరిగిన అల్లర్లలో మరో నలుగరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను యూపీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img