Friday, April 19, 2024
Friday, April 19, 2024

లాలూజీ.. మీ ఇంట్లోకి మళ్లీ పాము వచ్చింది…బీజేపీ నేత గిరిరాజ్‌ ట్వీట్‌

బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ ..లాలూప్రసాద్‌ యాదవ్‌ పాత ట్వీట్‌ లను రీ ట్వీట్‌ చేస్తూ నితీశ్‌ కుమార్‌ పై మండిపడ్డారు.లాలూజీ మీ ఇంట్లోకి మళ్లీ పాము వచ్చింది అంటూ గిరిరాజ్‌ ట్వీట్‌ చేశారు. 2017లో నితీశ్‌కుమార్‌ ఆర్జేడీతో విడిపోయిన సమయంలో లాలూ ఓ ట్వీట్‌లో నితీశ్‌ ఓ పాము అనీ, పాము కుబుసాన్ని వదిలి కొత్త చర్మాన్ని తొడుగినట్లు.. నితీశ్‌ కూడా ప్రతి రెండేళ్లకోసారి కూటమిని మారుస్తారని, ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా అంటూ ట్వీట్‌ చేశారు. నిషేధ చట్టానికి సంబంధించి గిరిరాజ్‌ సింగ్‌ మరో ట్వీట్‌లో జేడీయూ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం తర్వాత బిహార్‌ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా లిక్కర్‌ మాఫీయాకే వెళ్తుందని, జేడీయూ తన పార్టీని బతికించుకునేందుకు ఉపయోగిస్తోందన్నారు. ఈ రోజు నిషేధచట్టం తొలగిపోతుదని, రేపు జేడీయూ ముగుస్తుందన్నారు. నిషేధం తర్వాత, జేడీయూ విరాళాల సేకరణలో అపూర్వమైన పెరుగుదల ఉందని ఆరోపించారు. నితీశ్‌ అందరి వాడు కాదని, కేవలం కుర్చీకే చెందినవాడని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img