Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

లైంగిక వేధింపులపై కమిటీ తప్పనిసరి: కేంద్రం

న్యూదిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రతి సంస్థ లేదా యజమాని అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కనీసం పది లేదా అంతకుమించి కార్మికులు లేదా ఉద్యోగులు పనిచేస్తున్న ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ సంస్థలన్నీ ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఏ హోదాలో పనిచేస్తున్నారన్న విషయాన్ని పక్కనపెట్టి..పని ప్రదేశంలో మహిళలకు భద్రత కల్పించే లక్ష్యంతో ‘పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల(నియంత్రణ, నిషేధం, పరిష్కారం) 2013 చట్టాన్ని ప్రభుత్వం రూపొందించిందని కేంద్ర కార్మికశాఖమంత్రి భూపేందర్‌ యాదవ్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. ఈ చట్టం ప్రకారం ఏ సంస్థ అయినా పది లేక అంతకన్నా ఎక్కువ మంది పనిచేస్తుంటే లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ జరపడానికి అంతర్గత కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రతి జాల్లాలో స్థానిక కమిటీలు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని వివరించారు. ఫ్యాక్టరీల చట్టం 1948 కూడా అమలు ఉందని, ఈ చట్టం ప్రకారం కార్మికులు లేదా ఉద్యోగులకు వృత్తి భద్రత, ఆరోగ్య భద్రత, కార్మికుల సంక్షేమం చూడాల్సి ఉందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img